Svoboda | Graniru | BBC Russia | Golosameriki | Facebook

పెర్ఫ్యూమ్ సువానన ఎక్కువ సేపు ఉండాలా? ఇలా చేయండి!

Jun 14, 2024

By: Akhil Killada

4 సార్లు చాలు

మీరు ఉపయోగించే పెర్ఫ్యూమ్ రకాన్ని బట్టి 1 లేదా 2 సార్లు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. సువాసన ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 3 నుంచి 4 సార్లు స్ప్రే చేసుకోవచ్చు.

Image Source: pexels-com

సరి సమానంగా..

స్ప్రే చేసే సమయంలో అన్ని చోట్ల సమానంగా అప్లయ్ అయ్యేలా చూసుకోవాలి. ఎక్కువగా ఒకే ప్రదేశంలో ఎక్కువగా ఫెర్‌ఫ్యూమ్‌ చల్లుకోవడం సరైన విధానం కాదు.

Image Source: pexels-com

దూరంగా ఉంచి స్ప్రే

శరీరానికి 5 నుంచి 7 అంగుళాల దూరంగా బాటిల్‌ను ఉంచి పెర్ఫ్యూమ్ స్ప్రే చేయాలి. ఇంకా దూరం నుంచి స్ప్రే చేస్తే శరీరంపై సరిగా పడకుండా గాలిలో కలిసిపోతుంది.

Image Source: pexels-com

పల్స్ పాయింట్ల

శరీరంలో ఎక్కడ పడితే అక్కడ స్ప్రే చేయకూడదు. పల్స్ పాయింట్స్‌లో పెర్ఫ్యూమ్‌ను స్ప్రే చేయాలి. అంటే.. మణికట్టు, మెడపై, చెవుల వెనుక, మోచేయి మడతలపై స్ప్రే చేసుకోవాలి.

Image Source: pexels-com

నగలు, దుస్తులపై..

నగలు, దుస్తులపై పెర్ఫ్యూమ్‌ను స్ప్రే చేయడంతో మరకలు పడే ప్రమాదం ఉంది. ఈ మరకలు కూడా సులభంగా వదలవు. దుస్తులపై స్ప్రే చేస్తే సువాసన కూడా కూడా తగ్గిపోతుంది.

Image Source: pexels-com

తేమగా ఉన్నప్పుడు

శరీరం తేమగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే ప్రయోజనం ఉంటుంది. అందుకే.. స్నానం చేసిన తర్వాత శరీరం తేమగా ఉన్నప్పుడే పెర్‌ఫ్యూమ్ స్ప్రే చేసుకోండి. ఇలా చేస్తే సువాసన ఎక్కువసేపు ఉంటుంది.

Image Source: pexels-com

సీ‌‌జన‌ల్‌గా మార్చాలి

సీజన్‌ను బట్టి మనం వాడే పెర్ఫ్యూమ్‌ను మార్చాలి. వేసవిలో చర్మం ఎక్కువ తేమగా ఉంటుంది. కాబట్టి తక్కువ గాఢత ఉండే పెర్ఫ్యూమ్‌ను వేసవిలో వాడాలి. ఎక్కువ గాఢత ఉండే పెర్ఫ్యూమ్‌ను చలికాలంలో వాడాలి.

Image Source: pexels-com

ఎక్కువ గాఢత వద్దు

మరీ ఎక్కువ గాఢత ఉండే పెర్ఫ్యూమ్స వల్ల ఇతరులకు ఇబ్బంది కలగొచ్చు. మన చుట్టూ ఉన్నవారికి ఆ వాసన పడకపోతే వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

Image Source: pexels-com

పొడి, చల్లని ప్రదేశంలో..

పెర్ఫ్యూమ్స్‌ను వాడడమే కాదు భద్రపరుచుకోవడం కూడా చాలా ముఖ్యం. పొడిగా, చల్లగా ఉండే ప్రదేశంలో వీటిని ఉంచితే సువాసన కోల్పోకుండా ఉంటాయి.

Image Source: pexels-com

Thanks For Reading!

Next: ఫ్రిజ్‌లో నుంచి దుర్వాసన వస్తుందా? పోగొట్టే చిట్కాలివే!

Find out More